పోలీసుల లాఠీఛార్జీపై బండి సంజయ్ మండిపాటు

ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని విమర్శలు

Bandi Sanjay
Bandi Sanjay

Janagama: జనగామలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల   లాఠీఛార్జీపై ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండి పడ్డారు.    పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు నిరసనకు పిలుపునివ్వడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనగామలో ర్యాలీ నిర్వహించారు. జనగామ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి,  పోలీసుల లాఠీఛార్జిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు.   రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని  విమర్శలు గుప్పించారు. 

లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని,  స్వామి వివేకానంద ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం :https://www.vaartha.com/specials/women/