ప్రధాని మోడికి సోనియా గాంధీ లేఖ
అసలే బాధల్లో ఉన్న ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టకూడదు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు. దేశంలో కరోనా వల్ల తలెత్తిన సంక్షోభంతో బాధపడుతోన్న ప్రజలపై మరింత భారం వేసేలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నారని ఆమె అన్నారు. ఈ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అసలే బాధల్లో ఉన్న ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టకూడదని సోనియా గాంధీ సూచించారు. సంక్షోభ సమయంలో ధరల పెంపు తప్పుడు నిర్ణయమని ఆమె విమర్శించారు. ప్రజలపై అధిక ధరల భారం మోపి లాభం పొందాలని చూడడం సహేతుకం కాదని చెప్పారు. కాగా, గత పది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/