రేపు కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ
ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే హింసాకాండకు నిరసిస్తూ సోనియా గాంధీ నాయకత్వంలో రేపు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించనుంది. సిఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా జరుగుతున్న అల్లర్లలో దాదాపుగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ హింసాకాండకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని చేపట్టనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఈ ర్యాలీ జరుగనుంది. ర్యాలీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేయనుంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/