ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి
జగన్ తుగ్లక్ చర్యను దేశమంతా వ్యతిరేకిస్తుంది

విజయవాడ: వైఎస్ఆర్సిపి ఉద్దేశపూర్వకంగానే అమరావతిపై అల్లరి చేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైఎస్ఆర్సిపి పాలనను అయోమయంలోకి నెట్టిందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అందరి ఆమోదంతోనే చంద్రబాబు నాయుడు ..రాజధానిగా అమరావతిని నిర్ణయించరన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వ విధానాలతో పెట్టబడులు వెనక్కిపోతున్నాయని విమర్శించారు. జగన్ తుగ్లక్ చర్యను దేశమంతా వ్యతిరేకిస్తుందని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/