కొత్త సచివాలయ నమూనాపై సిఎం సమీక్ష

కొత్త సచివాలయ నమూనాపై సిఎం సమీక్ష
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ కొత్త స‌చివాల‌యం న‌మూనాపై సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఇంజినీర్లు, ఆర్కిటెక్చ‌ర్లు హాజ‌ర‌య్యారు. అర్కిటెక్ట్స్‌ నిపుణులు ఆస్కార్‌పొన్ని ఇచ్చిన న‌మూనాకు సూత్ర‌ప్రాయంగా ఆమోదం తెలిపిన కెసిఆర్‌ కొన్ని మార్పులు, చేర్పులు చేయాల‌ని బుధ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఇంజినీర్ల‌కు, అధికారుల‌కు సూచించారు. అధికారులు, ఇంజినీర్లు క‌లిసి మార్పులు, చేర్పులు చేశారు. ఈ అంశంపైనే అధికారుల‌తో సిఎం చ‌ర్చిస్తున్నారు. కొత్త సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లలో కూడా అన్ని సౌకర్యాలు ఉండాలని గ‌తంలో సిఎం కెసిఆర్ చెప్పిన విష‌యం విదిత‌మే. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్‌ హాలు, మీటింగ్‌ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాలు ఉండాలని, పార్కింగ్‌ ప్రదేశంలో అన్ని రకాల వాహనాలను నిలిపే సౌకర్యం ఉండాలని స్పష్టంచేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/