కాంగ్ర్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే

ఎలాంటి మార్పు లేదని పార్టీ శ్రేణులు వెల్లడి

Sonia Gandhi as Congress President
Sonia Gandhi as Congress President

New Delhi: కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం అధ్యక్షుని విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదని పార్టీ శ్రేణుల ద్వారా సమాచారం . ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు నాయకత్వం వహిస్తారని, భవిష్యత్తు చర్యలు తీసుకుంటారని పార్టీ నేత మల్లికార్జున్‌ ఖర్గే వెల్లడించారు. సోనియా నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం మీడియా తో నేతలు మాట్లాడారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/