ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోవు వీర్రాజు తొలగింపు..జేపీ నడ్డా ఫోన్

కొత్త అధ్యక్షుడిగా సత్యకుమార్ ను నియమించే అవకాశం

somu-veerraju

అమరావతిః ఏపి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుకు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. సోము వీర్రాజుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా ఫోన్ చేశారు. అధ్యక్షుడిగా మీ టర్మ్ పూర్తి అయిందని… పదవికి రాజీనామా చేయాలని వీర్రాజుకు నడ్డా సూచించారు. ఏపీ నూతన అధ్యక్షుడిగా సత్యకుమార్ ను నియమించనున్నట్టు సమాచారం. వీర్రాజుకు ఇతర బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.