ఒలంపిక్స్‌ వచ్చే ఏడాదే..!

2021 జులై23 నిర్వహించే భావనలో ఐఓసీ

olympic games
olympic games

టోక్యో: ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ ప్రభావం వల్ల అన్ని రకాల క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే ఈ సంవత్సరం జరగాల్సిన ఒలంపిక్స్‌ కూడా వాయిదా పడడంతో.. ఈ ఈవెంట్‌ను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దీనిని 2021 జులై 23న ప్రారంభించి, ఆగష్టు 8 న ముగించాలనే భావనలో ఇంటర్నేషనల్‌ ఒలంపిక్‌ కమిటి (ఐఓసి) ఉన్నట్లు జపాన్‌ మీడియా చెబుతుంది. వాస్తవానికి ఈ సంవత్సరం జరగాల్సిన ఒలంపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో జపాన్‌కు భారీ నష్టం వస్తుందని ఆ దేశ ఆర్ధిక మంత్రి యసుతోషి నిషిముర అన్నారు. అయితే ఈ ఈవెంట్‌ కోసం జపాన్‌ 12 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/