3 రోజుల్లో తెలంగాణ లో ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 65 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ల సంఖ్య 164కు చేరింది. ఇంకా ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా నామపత్రాలు దాఖలు చేసేందుకు ఆదివారం సెలవు దినంగా ఈసీ గతంలోనే ప్రకటించింది. దీంతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసే వీలు లేదు.

మరోపక్క అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎవరికీ వారు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ వరుస పర్యటనలతో తన దూకుడు ను చూపిస్తుండగా..మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 24 నుండి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇక ప్రధాని మోడీ సైతం ఈ నెల చివరి వారం లో లేదా మే మొదటి వారంలో తెలంగాణ లో పర్యటించబోతున్నారు.