భారత్ జోడో యాత్రకు స్మాల్ బ్రేక్ ఇచ్చిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర కు స్మాల్ బ్రేక్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఈరోజు పాదయాత్ర కు బ్రేక్ ఇచ్చారు రాహుల్. నిన్న తిరువనంతపురంలో శివగిరి మఠాన్ని సందర్శించారు. ప్రముఖ తత్వవేత్త.. సంఘ సంస్కర్త నారాయణ గురుకు నివాళులర్పించారు. నారాయణ గురు బోధనలకు విరుద్ధంగా బిజెపి, ఆర్ఎస్ఎస్ లు వ్యవహరిస్తూ హింసను, ద్వేషాన్ని నింపుతున్నాయని ఆరోపించారు. నిన్న కొల్లం జిల్లాలో అడుగుపెట్టిన రాహుల్ అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు.

సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. సెప్టెంబర్ 15వ తేదీన ఒకరోజు విరామం తర్వాత శుక్రవారం కేరళలోని కొల్లాం నుండి యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. రాహుల్ గాంధీతో పాటు సిబ్బంది కూడా కొంత ఇబ్బంది పడుతుండడంతో యాత్రకు ఒకరోజు విరామంమం ప్రకటించారు. ఈ యాత్ర కేరళలో మొత్తం 18 రోజులపాటు కొనసాగాల్సి ఉంది. కేరళ నుంచి ఈ నెల 30వ తేదీన కర్ణాటకలోకి ఈ యాత్ర చేరుకుంటుంది.