కంటి నిండా నిద్రకు..

Sleeping

హాయిగా కంటి నిండా నిద్ర పోవాలనుకుంటే రాత్రి పడుకోబోయే ముందు ఒక కప్పు టీ తాగాలి. అవును ఇది నిజం. అయితే అది సాధారణ టీ కాదు మరి! అల్లం, పుదీనా, నిమ్మ ఇవేవీ కాదు. ఇదొక పండుతో చేసిన టీ. మరి ప్రత్యేకమైనదే కదా.

అదీ అరటి పండు టీ అరటి పండును శుభ్రంగా కడిగి రెండు వైపులా కొసలను తీసేయాలి. ఒక పాత్ర తీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి, అరటి పండు వేసి పదినిమిషాల పాటు మరిగించాలి. ఆ తరవాత వడబోయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ టీ తాగాలి. కావాలనుకుంటే చిటికెడు దాల్చినచెక్క పొడి వేసుకోవచ్చు. లేదా మరుగుతున్న నీటిలో అరటిపండుతో పాటు దాల్చిన చెక్క ముక్క కూడా వేయవచ్చు.

ఈ పండు తియ్యగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చక్కెర, తేనె వంటి అవసరముండదు. అరటిలోని పొటాషియం, మెగ్నీషియం మూలకాల వల్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పండులోని అమైనో ఆమ్లాలు స్లీప్‌ హార్మోన్‌గా పిలిచే మెలటోనిన్‌ను ప్రేరేపి స్తాయి. దాంతో హాయిగా నిద్రపడుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/