సొర కళాకృతులు

Seema Prasad

వర్షాభావ పరిస్థితులే వారికి ఆటంకంగా నిలుస్తున్నాయి. ఖర్చులన్నీ భరించి సీమా ప్రసాదే వాటిని కొనుగోలు చేస్తుంది. పెళ్లిళ్లుకు సహజసిద్ధ సొరకాయ హ్యాంగిగ్స్‌, లైట్లతో ఈవెంట్లు చేయడం, సొరకాయ కళాకృతులతొ పెట్టడమే తన లక్షమని చెబుతోందామే. సీమ ప్రసాద్‌కు చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టం. మైసూరులో పుట్టి పెరిగింది. భర్త కృష్ణప్రసాద్‌ విత్తనాలను సేకరించి, నిల్వ చేసే సంస్థను నిర్వహిస్తాడు.

మనసు ఉండాలే కాని చేతితో ఎన్నో అద్భుతాలను చేయవచ్చు. ఆకట్టుకునే వస్తువ్ఞలను తయారు చేయవచ్చు. మామూలు కూరగాయలతో కూడా కళాకృతుల డెకరేషన్‌ వస్తువ్ఞల్ని అందంగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తున్నారు సీమాప్రసాద్‌. సొరకాయ అనగానే పెద్దకాయగా చూడముచ్చటా కనిపిస్తుంది. మనమైతే దాన్ని సొరకాయగానే చూస్తాం. కానీ సీమాప్రసాద్‌కు మాత్రం వినూత్న ఆలోచన మదిలో మెదిలింది.

దీన్ని రంగురంగుల్లో అందమైన ఆకృతుల్లో తీర్చిదిద్దాలనుకున్నారు. అనుకున్నదే తడవ్ఞ దీనికోసం ఆఫ్రికా దేశాలకు వెళ్లి మరీ పరిశోధన చేసిందామే. సొరకాయలను రకరకాల ఆకృతుల్లో తీర్చిదిద్దడానికి మొదట కొందరు ఆర్టీస్టుల సహాయం తీసుకునేది సీమ. కొన్ని రోజులకు తనే యూట్యూబ్‌లో చూస్తూ ప్రయత్నించేది. ఇలా ఎన్నో కొత్త డిజైన్లు రూపొందించింది. ఆమె కళాకృతుల్లో గిరిజన పనితనం ఊట్టిపడుతుంది. దీనికోసం ఆమె కొన్ని పద్ధతులు పాటిస్తోంది. మొదట సొరకాయను ప్రత్యేక పద్ధతుల్లో కాలుస్తుంది. దానిపై తెల్లటి రంగు వేసి వాటిపై అచ్చెరువొందించే ఆకృతులు రూపొందిస్తుంది. ఇవన్నీ చేతితో తయారైన పర్యావరణహిత ఉత్పత్తులే వినియోగదారుల కోరిక మేరకు లోగోలు పేర్లతో వారు మెచ్చేటట్లు తీర్చిదిద్దుతున్నారు.

శుభసందర్భాల్లో ఆర్డర్లు వస్తుంటాయి. మొదట్లో రైతులకు సొరకాయ విత్తనాలు పంపిణీ చేసి పంట పండించమని కోరింది సీమ. వారికి నమ్మకం కుదరలేదు. కొందరు మాత్రమే ముందుకు వచ్చారు. 2017 నుంచి వారే కావాల్సిన సొరకాయలు సరఫరా చేస్తున్నారు. అడవి అనపకాయలు రోడ్ల పక్కన, అక్కడక్కడా పెరుగుతాయి. కొన్ని రోజుల నుంచి రైతులే వీటిని పండిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులే వారికి ఆటంకంగా నిలుస్తున్నాయి.

ఖర్చులన్నీ భరించి సీమా ప్రసాదే వాటిని కొనుగోలు చేస్తుంది. పెళ్లిళ్లుకు సహజసిద్ధ సొరకాయ హ్యాంగిగ్స్‌, లైట్లతో ఈవెంట్లు చేయడం, సొరకాయ కళాకృతులతొ పెట్టడమే తన లక్షమని చెబుతోందామే. సీమ ప్రసాద్‌కు చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌ చాలా ఇష్టం. మైసూరులో పుట్టి పెరిగింది. భర్త కృష్ణప్రసాద్‌ విత్తనాలను సేకరించి, నిల్వ చేసే సంస్థను నిర్వహిస్తాడు. ఇక్కడే సేవ్‌ అవర్‌ రైన్‌ ప్రాజేక్టుకు సమన్వయకర్తగా చేసిందామే.

700 రకాల సంప్రదాయ వరి వంగడాలను సంరక్షించి నిల్వ చేసింది. అపుడూ ఆమె ప్రతిభను గుర్తించి గ్రాఫిక్స్‌ వెబ్‌సైట్‌ డిజైనింగ్‌ నేర్చుకోమి ప్రోత్సహించేవాడు భర్త. ఆ సమయంలో సొరకాయ గురించి ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకుంది సీమ. ప్రస్తుతం పెన్నులు, టిష్సులు కీచైన్లు హోల్డర్లు, పూల కుండీలు, లాంప్‌ షేడ్స్‌ హ్యాంగింగ్స్‌ వంట పాత్రలు ఇలా 48 రకాల ఉత్పత్తులను తయారుచేసింది.

కృషికళ ఇన్‌ వెబ్‌సైట్‌లో వీటిని చూడోచ్చు ప్రస్తుతం నలుగురు మహిళలతో కలిసి వీటిని తయారుచేస్తోంది. 68 మంది గ్రామీణ మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చింది. వారు తయారుచేసి ఉత్పత్తులను ఆమెనే కొనుగోలు చేస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/