మెనోపాజ్ లో చర్మ జాగ్రత్తలు

ఆరోగ్య సంరక్షణ

నెలసరి నిలుస్తున్న సమయంలో చర్మం పలు రకాలుగా ప్రభావితం అవుతుంది ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గటంతో ఈ మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కలిగే పరిణామాల గురించి, అలాగే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు.

Skin Care in Menopause
Skin Care in Menopause


కొల్లాజెన్ ఉత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజెన్ తగ్గటంతో చర్మంలో పలు శాశ్వత మార్పులు మొదలవుతాయి.. ముఖ చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది.. చర్మం కింద కొవ్వు తగ్గుతుంది.. దీంతో ముఖమంతా పొడిబారి, ముడతలు, గీతాలు ఏర్పడతాయి.. వవ సమస్య పూర్తిగా నివారించలేక పోయినా ముందస్తుగా తీసుకునే కొన్ని జాగ్రత్తలు వవ ప్రభావానికి త్వరగా చేరుకోకుండా చూస్తాయి.. కొందరిలో 40లోకి అడుగుపెడుతున్నపుడే మెనోపాజ్ లక్షణాలు మొదలు అవుతాయ్హి.. వీరి చర్మం, త్వరగా ప్రభావితమయ్యే ప్రమాదం వుంది. అందుకే 40 దాటినా వెంటనే ఈస్ట్రోజెన్ స్థాయిలను విద్య పరీక్షల ద్వారా తెలుసుకోగలగాలి. తగినట్టుగా ఎస్సెన్ షియల్ ఆయిల్ మర్దన, సబ్బు వంటి వాటిని కాకుండా డీహైడ్రేషన్ కు దూరంగా ఉంటే క్లేన్సర్ వినియోగించాలి.. సెరామైడ్స్ , షియా బట్టర్, ఫ్యాటీ ఆసిడ్స్, గ్లిసరిన్ వంటి వాటితో తయారు చేసే మాయిశ్చరైజర్లు వాడటం మంచిది.

రెటీనాల్ తో:

30 ఏళ్ళు నిండినప్పటి నుంచి కొంచెం కొంచెంగా చర్మంలో కొల్లాజెన్ తగ్గటం మొదలవుతుంది.. మెనోపాజ్ స్థాయికి వచ్చే సరికి దీని ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది.. దీంతో ముఖ చర్మంలో మార్పులు కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. దీని నుంచి దూరంగా ఉండాలంటే ముఖానికి సీరం అప్లై చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.. సి విటమిన్ ఉండే సీరం లీడ్ దీనికి బదులుగా సప్లిమెంట్ తీసుకున్నా ప్రయోజనమే.. చర్మాన్ని మరికొన్ని రోజులపాటు మృదువుగా ఉంచటానికి రాదో ఇది ప్రయత్నిస్తుంది.. అలాగే ఈస్ట్రోజెన్ తగ్గుతున్నపుడు హార్మోన్లలో చోటు చేసుకున్న మార్పులు చర్మంపై మచ్చలకు కారణం అవుతాయి. ఈ సమయంలో చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచే రెటీనాల్ ను ఉపయోగిస్తే ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరిచి మురికిని చేరనివ్వదు.. దీంతో మొటిమల సమస్య నుంచి బయట పడొచ్చు. అదే సమయంలో చర్మం పై ఏర్పడే గీతలకూ దూరంగా ఉండొచ్చు.. దీంతో పాటు సన్ స్క్రీన్ తోపాటు యాంటీ ఆక్సీడెంట్స్ ఉన్న ఉత్పత్తులు చర్మాన్ని పొడిబారనివ్వవు. మెనోపాజ్ ప్రభావం చర్మంపై త్వరగా పడకుండానూ పరిరక్షిస్తాయి.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/