స్కంద మూవీ ఎలా ఉందంటే..

రామ్ – బోయపాటి కలయికలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను చూసిన అభిమానులు..తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. రామ్ మరోసారి తన మాస్ యాక్షన్ తో డాన్సుల తో అదరగొట్టాడని చెపుతున్నారు. ధమాకా ఫేమ్ శ్రీ లీల సైతం ఎక్కడ తగ్గకుండా తన గ్లామర్ తో డాన్సులతో మరోలెవల్ చూపించిందని అంటున్నారు. యాక్షన్ ప్రియులకు ఫుల్ మిల్స్ దొరికినట్లే అని అంటున్నారు.

ఇక ఎప్పటిలాగానే తమన్ మ్యూజిక్, బీజీఎమ్ అదిరిపోయింది. స్కందలో రామ్‌ది మాస్ ఎంట్రీ.. అదిరిపోయింది.. ఆ సీన్‌కు తమన్ ఇచ్చిన ఆర్ఆర్, రామ్ స్క్రీన్ ప్రజెన్స్ రెండూ అద్భుతంగా ఉన్నాయని ఉస్తాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కచ్చితంగా హిట్టు కొడుతున్నామని ధీమాగా చెప్పేస్తున్నారు. పొట్టేల్ల కోతరా ఇది అంటూ స్కంద హిట్ అని ఇంకొకరు.. పులి వేటకొచ్చిందంటూ రెండో పాత్ర ఎంట్రీ కూడా అదిరిపోయిందంటూ నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.