‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ నుండి అదిరింది మెలోడీ సాంగ్ రిలీజ్

మాచర్ల నియోజకవర్గం నుండి అదిరింది అంటూ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో నితిన్..తాజాగా “మాచర్ల నియోజకవర్గం” అనే మూవీ తో ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా..ఉప్పెన ఫేమ్ శృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై నిర్మితమవుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఈ క్రమంలో సినిమా తాలూకా ప్రమోషన్ ను మొదలుపెట్టారు.ఇప్పటికే పలు స్టిల్స్ , టీజర్ , సాంగ్స్ విడుదల కాగా..తాజాగా సినిమాలోని ‘అదిరింది’ అనే మెలోడియ‌స్ వీడియో సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ పాట‌లో నితిన్‌, కృతి శెట్టి డ్యాన్స్ మూవ్‌మెంట్స్ అల‌రిస్తున్నాయి. కాగా ఈ పాట‌ను సంజిత్ హెగ్డే ఆల‌పించాడు. వరుస అప్ డేట్ ఇస్తూ చిత్ర నిర్వాహకులు ఈ మూవీపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు.

పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించగా… ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో సంయుక్తంగా శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.

YouTube video