సీతారామం బ్యూటీ చూపు తిప్పుకోకుండా చేస్తుందే

సీతారామం మూవీ తో యావత్ సినీ ప్రేక్షకులను, యూత్ ను తనవైపు తిప్పుకున్న బ్యూటీ మృనాల్ ఠాకూర్. సినిమాలో అచ్చమైన చీర కట్టులో ఏమాత్రం అందాల ఆరబోత చేయకుండా తెలుగు అమ్మాయిల కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడం తో అమ్మడికి భారీగా ఛాన్సులు వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం ఆచితూచి ఓకే చెపుతుంది. ప్రస్తుతం నాని సరసన ఓ మూవీ లో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత తో అబ్బా అనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫోటో షూట్స్ లలో కనువిందు చేసిన ఈ భామ…తాజాగా ఓ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో చూసేందుకు చాలా క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. లోనెక్ తో తన అందాలను ఆరబోసింది. అదిరిపోయే స్మైల్ తో అందిరినీ మెస్మరైజే చేసింది. ఈ ఫొటోలు చూసిన చాలా మంది అందంగా ఉన్నావు అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో నిన్న సీతగా చూడాలనుకుంటున్నాం.. ఇలాంటి బట్టలు వేసుకోకంటూ సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఒకే ఒక సినిమా తో విపరీతమైన ఫాలోయర్స్ ను , అభిమానులను దక్కించుకుంది ఈ భామ.