వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ : గాండివధారి అర్జున’ ఫస్ట్ లుక్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానులను మరింత సంబరాలకు గురి చేసారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్.. ‘గాండివధారి అర్జున’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఆయనకు 12 వ చిత్రం కావడం విశేషం. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం క్రేజీ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈరోజు వరుణ్ బర్త్ డే సందర్బంగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ లుక్ లో వరుణ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో రఫ్ లుక్ లో కనిపించాడు.

వరుణ్ కెరీర్ ప్రారంభం నుండి కమర్షియల్ కు దూరంగా ప్రయోగాలు చేస్తున్నాడు. తన కథల ఎంపిక క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. తాను తీసిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాబోతున్న ‘గాండీవధారి అర్జున’ సినిమా కూడా కొత్తగా ఉండబోతున్నట్లు సమాచారం.