నోయిడా విమానాశ్రయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన

YouTube video
PM Modi lays foundation stone of Noida International Airport at Jewar, Uttar Pradesh

న్యూఢిల్లీ: నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా జెవార్ ప్రాంతంలో 52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్ట్‌ను 10,500 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ మొదటి విడత నిర్మాణం పూర్తి చేసుకున్న వెంటనే 1.2 కోట్ల ప్యాసింజర్ సామర్థ్యానికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు అంటే 2024 లోపు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి పునాది రాయి వేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘ఉత్తరప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో నవంబర్ 25వ తేదీ ప్రముఖ దినంగా ఉండిపోతుంది. మద్యాహ్నం ఒంటిగంటకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన జరిగింది. నిర్ణయించుకున్న సమయంలోనే ఇది పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టుతో వ్యాపార, పర్యాటక రంగాలకు కొత్త ఊపు అందుకుంటుంది. అలాగే అనేక రంగాలకు మధ్య అనుసంధానం పెరుగుతుంది. ఇక్కడే 40 ఎకరాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్, ఓవరాల్, మెయింటేనెన్స్ కోసం నిర్మాణాలు జరగబోతున్నాయి. ఇక్కడి వందలాది మంది యువతకు దీంతో ఉపాధి లభిస్తుంది. రాజకీయాలు కాదు, మౌలికాభివృద్ధి అవసరం’’ అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/