ధనుష్ ‘సార్’ క్లోజింగ్ కలెక్షన్స్..కెరియర్లోనే రికార్డ్స్

ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీ ఫిబ్రవరి 17 న తెలుగు , తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై యువ నిర్మాత నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా మార్చి 17 నుండి నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సార్ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి.

నైజాం లో 8 కోట్ల 93 లక్షలు
సీడెడ్ లో మూడు కోట్ల 15 లక్షలు
ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు కోట్ల 34 లక్షలు
ఈస్ట్ గోదావరి ప్రాంతంలో రెండు కోట్ల నాలుగు లక్షలు
వెస్ట్ గోదావరి ప్రాంతంలో 93 లక్షలు
గుంటూరు ప్రాంతంలో కోటి 63 లక్షలు
కృష్ణాజిల్లాలో కోటి 49 లక్షలు
నెల్లూరులో 81 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 22 కోట్ల 32 లక్షల షేర్ 42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు లో ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అని చెపుతున్నారు.