కబ్జా ఫస్ట్ డే కలెక్షన్లు

కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్ లు హీరోలుగా నటించిన కబ్జా మూవీ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో శుక్రవారం విడుదల అయ్యింది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌ పై ఈ సినిమా తెరకెక్కగా.. ఆర్ చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రియ, కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపగా..మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుందని అంత భావించారు. కానీ థియేటర్స్ లలో సినిమాను చూసేందుకు పెద్ద గా ఇంట్రస్ట్ చూపించలేదు . దీంతో ఫస్ట్ డే దారుణమైన వసూళ్లు రాబట్టింది.

ఎర్లీ మార్నింగ్ షోలు లేకపోవడంతో కర్ణాటకలోని సింగిల్ స్క్రీన్ లలో కబ్జా సినిమా మొదటి రోజు కనీసం 10 లక్షల మార్కును కూడా దాటలేక పోయింది. పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా అంచనా వేసినప్పటికీ… ఎవరిలోనూ అంత ఇంట్రెస్ట్ ను కల్గించలేకపోయిందీ చిత్రం. కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాగా.. ఎక్కడా పెద్దగా ఆడడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటె రెండు , మూడు రోజుల్లో కబ్జా ను తీసేయడం ఖాయమని అంటున్నారు.