ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్ కిషోర్

ఢిల్లీలో ఇండియా ఆత్మను గెలిపించారు

kejriwa-Prashant Kishor
kejriwa-Prashant Kishor

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం నేపథ్యంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇండియా ఆత్మను గెలిపించారని ఆయన అన్నారు. ‘ఇండియా ఆత్మను రక్షించుకునేందుకు అండగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. 2014 జనరల్ ఎలక్షన్ల సమయం నుంచి ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చారు. ఆ ఎలక్షన్లలో బిజెపి తరఫున ప్రచార వ్యూహాలను అమలు చేసి మోడీ గెలుపు కోసం తోడ్పడ్డారు. ఆ తర్వాత కూడా పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. తాజాగా ఢిల్లీ ఎలక్షన్లలో అరవింద్ కేజ్రీవాల్ కు తోడుగా ఆప్ తరఫున ప్రచార వ్యూహాలు రూపొందించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/