చేవెళ్లలో దారుణం..యువతి హత్య

chevella-rangareddy
chevella-rangareddy

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. గ్రామశివారులో ఓ యువతి ముఖంపై బండరాళ్లతో కొట్టి హత్యచేశారు దుండగులు. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ అమానుష ఘటన చిలుకూరు దేవాలయం ప్రధాన రహదారిపై జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా ఆధారాల కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు కానీ, దస్తులు కానీ ఘటనా స్థలంలో లభించపోవడంతో ఆమె వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/