న్యూ ఇయర్ షాపింగ్ కు వెళ్తున్నారా?

పండుగ సందడి..

New Year Shopping


వంటింటి వస్తువులు , గాడ్జెట్లపై న్యూ ఇయర్ డిస్కౌంట్ లు ఊరిస్తుంటే .. కొనకుండా ఎలా ఉంటాం.. కోణం తప్ప్పుకాదు.. కానీ అది మన బడ్జెట్ లోనే ఉండటం తప్పనిసరి.. లేదంటే లోటు బడ్జెట్ తో అప్పు చేయాల్సి వస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలనే మార్కెట్ కు వెళ్లే ముందే అత్యవసరమైనవి , రాయితీలు గల వాలిటీకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతోపాటు నాణ్యతకు పెద్దపీట వేస్తే కొన్న వస్తువు ఎక్కువ కాలం మన్నుతుంది. మనం పెట్టిన ఖర్చుకు అర్ధం ఉంటుంది..

ఇతరులు , పక్కింటి వాళ్ళు కొన్నారని మనం షాపింగ్ చేయకూడదు. ఆ వస్స్తువులు మనకెంత అవసరమో ఆలోచించాలి. మనవద్ద ఉన్న వస్తువు బాగానే పనిచేస్తుంటే దాని స్థానంలో మరొక వస్తువును తేవాలి అనుకోకూడదు. అది డబ్బు వృధా చేయటమే అవుతుంది.. అలాగే ఇతరుల వద్ద ప్రదర్శించటానికి తాహతుకు మించి షాపింగ్ చేయటం అసలే మంచిది కాదు. షాపింగ్ కు బదులు స్నేహితులు , బంధువులతో కలసి గెట్ టుగెదర్ ప్రణాళిక చేస్తే ఆ సంతోషం పది కాలాలపాటు గుర్తు ఉంటుంది . డబ్బు మిగులుతుంది.

New Year Shopping

మన ఆర్ధిక పరిస్థితి కి తగినట్టుగా ఓ లిస్ట్ తయారు చేసుకోండి. వాటిలో కూడా అవసరం అనుకున్న వాటితో మరో జాబితా తయారు చేసుకోండి… క్రెడిట్ కార్డు ఉపయోగించాలనుకుంటే రివార్డ్ పాయింట్లు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. కాష్ బ్యాక్ సౌకర్యం వినియోగించుకుంటే అనుకున్న బడ్జెట్ షాపింగ్ పూర్తవుతుంది.. అలాగే డిస్కౌంట్ ను లెక్కలోకి తీసుకుంటూ తక్కువ ధరకు వస్తుందని చవక బారు వస్తువులు తీసుకోకూడదు… నాణ్యతనూ దృష్టిలో ఉంచుకోవాలి. షాపింగ్ కు వెళ్లేముందు కచ్చితంగా బడ్జెట్ నిర్ణయించుకోవటం , దాన్ని దాటకుండా ఉండటానికి ప్రయత్నిస్తే చాలు . అప్పు లేకుండా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా గడిపేయవచ్చు.