పడవ బోల్తా దుర్ఘటన : మొత్తం 8 మృతదేహాల గుర్తింపు

వలస కూలీల కుటుంబాల్లో విషాదం

families of migrant workers
families of migrant workers

Sileru: సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన మరో రెండు మృతదేహాలను కనుగొన్నారు. మృతులు లాక్షి, పింకీలుగా బంధువులు గుర్తించారు. మొత్తం 8 మంది మృతి చెందారు. మృతులు ఒడిశాలోని కోందుగూడ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు ఒడిశాలోని గుంటవాడ పంచాయతీ కోందుగూడా గ్రామానికి చెందిన కొందరు వలసకూలీలుగా తెలంగాణకు వెళ్లారు. అయితే, రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల
అర్ధరాత్రి సీలేరు రిజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై స్వగ్రామానికి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లిన వెంటనే నీట మునిగాయి. అధికారులు మంగళవారం గాలింపు చర్యల్లో 6 మృతదేహాలు లభ్యమయ్యాయి తిరిగి బుధవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/telangana/