బెయిల్ రద్దు కేసు విచారణ మళ్లీ వాయిదా

కౌంటర్ దాఖలుకు మరింత గడువు కోరిన జగన్, సీబీఐ అధికారులు

ap cm jagan-Bail revocation case hearing adjourned again
ap cm jagan-Bail revocation case hearing adjourned again

Amaravati: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయలంటూ నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.

లాక్‌ డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలుపారు. సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది.. ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/