ఆ హీరో అంటే తెగ ఇష్టమట

టీవీ షోలో కాజోల్ గురించి చెప్పిన కరణ్ జోహార్

Actress Kajol

‘ దిల్వాలే దుల్హానియా లే జాయేంగే’ తో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన బాలీవుడ్ సుందరి కాజోల్.

 కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే నటుడు అజయ్ దేవగన్ ను 1999 ఫిబ్రవరి 24న వివాహం చేసుకుంది.

ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే కాజోల్ కు ఓ హీరో అంటే తెగ ఇష్టమట.

ఆయన కనిపిస్తే చాలు సంబరపడిపోయేదట. ఆ హీరోనే బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్.

ఈ విషయాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ టీవీ షోలో వెల్లడించారు.

కరణ్ జోహార్ కాజోల్ మంచి స్నేహితులు. వీరిద్దరు తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/