కర్నూలు జిల్లాలో మరో ఐదు కరోనా కేసులు

కలెక్టర్‌ వీరపాండియన్‌ వెల్లడి

kurnool
kurnool

కర్నూలు: కర్నూలు జిల్లాలో రోజరోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా జిల్లాలొ మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 96 కు చేరుకుందని జిల్లా పాలనాధికారి వీరపాండియన్‌ వెల్లడించారు. జిల్లాలో కోవిడ్‌ కారణంగా ఒకరు మరణించగా… ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసరమయితే తప్ప బయటికి రావద్దని కలెక్టర్‌ సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/