కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు

కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం : మంత్రి సత్యవతి

మహబూబాబాద్ : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద నిరసన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రైతు ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. కానీ, ప్రధాని మోడీ మాత్రం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అన్నదాత నడ్డి విరుస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.

కేంద్రం దిగి వచ్చి ఇక్కడ పండించిన బియ్యం మొత్తం కొనుగోలు చేసేందుకు హామీ ఇచ్చే వరకు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయన్నారు. ప్రజలంతా రైతుకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/