స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన సీమెన్స్ ఎండీ

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు లో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో యావత్ ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు స్కామే జరగని దాంట్లో కావాలని చంద్రబాబు ఫై కేసు పెట్టారని టీడీపీ ఆరోపిస్తుంది. మరోపక్క పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు కు మద్దతు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కాం జరిగిదంనే ఆరోపణలు నిరాధారమని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించినట్లు వివరించారు. సిమెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ జరగలేదని సీఐడీ ఆరోపణలు అవాస్తవమన్నారు. APSSDC ప్రభుత్వ సంస్థ కాదా? అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు వింటుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేయడం సులువని.. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారని తెలిపారు.