గిరిజన యువకుడిని చిత్రహింసలు పెట్టిన ఎస్సై సస్పెండ్..

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరులో ఐదు రోజుల క్రితం ఓ దొంగతనం కేసులో పోలీసులు అన్యాయం గా ఓ గిరిజనుడ్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన సంగతి తెలిసిందే. దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా..ఎస్సై తనను చిత‌క‌బా‌దా‌డని, కాళ్ల మీద పడ్డా కని‌కరం చూప‌లే‌దని.. రోజంతా గోడకుర్చీ వేయించి కొట్టారని బాధితుడు ఆరో‌పిం‌చారు. ఎస్సైని వెంటనే విధుల నుంచి తొల‌గిం‌చా‌లని బాధితుడి కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తులు డిమాండ్ చేశారు. దీంతో విచారణ జరిపిన ఎస్పీ రాజేంద్రప్రసాద్..ఆత్మకూర్(‌ఎస్‌) ఎస్సై లింగం ను సస్పెండ్ చేసారు.

ఉప్పల్ ఎస్సైగా పనిచేసిన లింగం.. లాక్ డౌన్ లో ఓ నర్సు భర్తపై చేయి చేసున్నాడు.ఈ కేసులో సస్పెండ్పై సూర్యాపేటకు బదిలీ అయ్యారు. ఇక ఇప్పుడు అన్యాయంగా గిరిజనుడ్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి ఇక్కడ కూడా సస్పెండ్ అయ్యాడు. మళ్లీ ఇంకెక్కడి పోయి..అక్కడ ఏంచేస్థాడో అని అంత మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం జై భీమ్ మూవీ తరహాలో ఎస్సై లింగానికి కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.