మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బొగ్గు గని ప్రమాదం : గని డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్ వైజర్లపై సస్పెన్షన్ వేటు

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బొగ్గు గని లో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సింగరేణి కాలరీస్ కు చెందిన శ్రీ రాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్ పీ-3 బొగ్గు గనిలో బుధువారం మొదటి షిఫ్టు కార్మికులు విధులు నిర్వహిస్తుండగా గని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటన లో నలుగురు మృతి చెందారు.

ఈ ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదం గురువారం జరిగింది. పైకప్పు కూలిపోవడం తో ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలు అయ్యాయి. పైకప్పు గురించి అధికారులకు సమాచారం అందించినా సరైన చర్యలు తీసుకోవడం లేదని.. ఆ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఈ ప్రమాదం ఫై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు ముగ్గురిని ప్రమాదానికి బాధ్యులుగా గుర్తించినట్లు తెలిపింది. గని మేనేజర్ కు చార్జిషీట్ జారీ చేసింది.ఇశాళ మధ్యహ్నం ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి యాజమాన్యం. ప్రమాద ఘటన విషయంలో ఇంత స్పీడుగా చర్యలు తీసుకోవడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు కార్మికులు.