మారండి లేదంటే మార్పులు త‌ప్ప‌వు .. ఎంపీల‌కు ప్రధాని వార్నింగ్‌

న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరవుతున్న బీజేపీ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మందలించారు. మీరైనా మారండి లేదంటే మేమే మార్చేస్తామ‌ని ప్ర‌ధాని మోడీ త‌మ పార్టీ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు రెగ్యుల‌ర్‌గా అటెండ్ కావాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌తిసారి ఈ విష‌యంలో మీపై వ‌త్తిడి తీసుకురావ‌డం స‌రిగా లేద‌ని, పిల్ల‌ల త‌ర‌హాలో ట్రీట్ చేయ‌లేమ‌ని, మీరు మార‌క‌పోతే, అప్పుడు క్ర‌మంగా మార్పులు జ‌రుగుతాయ‌ని ఆయ‌న అన్నారు. శీతాకాల స‌మావేశాల్లో మోడీ స‌ర్కార్‌పై విప‌క్షాల నుంచి వ‌త్తిళ్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న పార్టీ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇక రాబోయే ఏడాది ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలోనూ ఆయ‌న ఈ హెచ్చ‌రిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/