తగ్గేదేలే అంటున్న శ్యామ్ సింగ రాయ్..

కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్రసీమా కు భారీ నష్టం జరిగింది. షూటింగ్ లు ఆగిపోవడం ,రిలీజ్ లు ఆగిపోవడం తో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అంత సర్దుమునగడంతో తమ సినిమాలను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి బరిలోనే కాదు క్రిస్మస్ బరిలో కూడా పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పుష్ప టీం డిసెంబర్ 17 న పుష్ప పార్ట్ వన్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అల వైకుంఠపురంలో తర్వాత బన్నీ నుండి వస్తున్న సినిమా కావడం , అలాగే రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమా కావడం తో పుష్ప ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సినిమా టైం లో రిలీజ్ చేసేందుకు ఇతర నిర్మాతలు కాస్త ఆలోచిస్తుంటే..శ్యామ్ సింగ రాయ్ యూనిట్ మాత్రం ఎక్కడ తగ్గేదిలే అంటూ తమ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘పుష్ప’ హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 17వ తేదీన ఆ సినిమా థియేటర్లకు వస్తే వసూళ్ల జోరు కనీసం ఓ 3వారాలపాటైనా సాగుతుంది. ఆ లోగా ఆ జోన్ లోకి వెళ్లకపోవడం ఉత్తమమనే చాలామంది అనుకున్నారు. కానీ ‘శ్యామ్ సింగ రాయ్’ అలా భయపడే రకం కాదు అన్నట్టుగా ఆ తరువాత వారమే థియేటర్లకు వస్తున్నట్టుగా చెప్పేశాడు. మరి పుష్ప కు తట్టుకొని శ్యామ్ నిలబడగలడో లేదో చూడాలి.