చంద్రబాబు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు ‘ దీక్ష ప్రారంభం

తెలుగుదేశం కార్యాలయాల ఫై వైసీపీ కార్య కర్తలు , నేతలు చేసిన దాడికి నిరసనగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో దీక్ష మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్ష కొనసాగనుంది. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదికను ఏర్పాటు చేశారు. రేపు రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. దీక్షకు మద్దతుగా వివిధ జిల్లాల నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు.

మరి పోలీసులు కార్యకర్తలను దీక్ష వరకు అనుమతి ఇస్తారో లేదో చూడాలి. మరోపక్క ఈరోజు రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను టీడీపీ నేతలు కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తదితరులు గవర్నర్‌ వద్దకు వెళ్లి వైసీపీ కార్యకర్తల దాడి గురించి మాట్లాడనున్నారు.