జర్మనీలోని హనావ్‌లో కాల్పులు.. 8 మంది మృతి

జర్మనీ: కాల్పులతో జర్మనీ ఒక్కసారిగా దద్దరిల్లింది. ఈ ఘటన జర్మనీ కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో హనావ్ నగరంలో జరిగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. నగరం మధ్యలో ఉన్న హుక్కా సెంటర్ వద్ద తొలుత కాల్పులు జరిపిన దుండగులు ఆ తర్వాత మరో ప్రాంతానికి చేరుకుని కాల్పులు జరిపారు. తొలుత జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, రెండోసారి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిని ఉగ్రఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/