భర్త, అత్త ప్రాణాలు తీసి.. ముక్కలు చేసి కొండల్లో విసిరేసిన కోడలు

ప్రియుడి సాయంతో ఘోరానికి పాల్పడిన మహిళ

Assam Woman Kills Husband, Mother-In-Law, Hides Body Parts In Fridge

అస్సాం: ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనవాలా ఘటన మరిచిపోనేలేదు.. అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. గువాహటి సమీపంలోని నున్‌మతిలో ఓ యువతి భర్త, అత్తను దారుణంగా చంపేసింది. వారి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి..ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి కొండల్లో విసిరేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం రేపింది.

వందన కలీట అనే మహిళకు అమరేంద్ర దే అనే వ్యక్తితో పెళ్లయింది. అయితే ఆమెకు ఇది వరకే ధంజిత్ దేకా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఏడు నెలల కిందట ప్రియుడు.. మరో స్నేహితుడు అరూప్ దాస్‌తో కలిసి భర్త అమరేంద్ర దే, అత్త శంకరి దేని కలీట హత్య చేసింది. చంపేసిన తర్వాత వారి శరీర భాగాలను ముక్కలుగా కోసి పాలిథీన్ కవర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. మూడు రోజుల తర్వాత వాటిని గౌహతికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో మేఘాలయాలోని చిరపుంజికి తన ప్రియుడితో కలిసి వెళ్లి అక్కడి కొండల్లో విసిరేసింది.

భర్త, అత్త హత్యలపై ఎవరికీ అనుమానం రావొద్దని నిందితురాలు వందన కలీట పోలీసులకు కంప్లేయింట్ ఇచ్చింది. 2022 సెప్టెంబర్ లోనే తన భర్త.., అత్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత అమరేంద్ర దే కజిన్ కూడా మిస్సింగ్ కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులకు అనుమానాలు వచ్చాయి. నూన్‌మతి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయ్యాయి. వీటిపై విచారణ చేసిన పోలీసులు వందన ప్రవర్తన పట్ల సందేహాలు వ్యక్తం చేశారు. అదే కోణంలో దర్యాప్తు చేయగా…అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లీకొడుకులను తానే హత్య చేసినట్లు వందన కలీట అంగీకరించింది. ఈ హత్యలు చండ్‌మరి, నారేంగి అనే వేర్వేరు ప్రాంతాల్లోని రెండు ఇళ్లల్లో జరిగినట్లు చెప్పింది. అనంతరం కొన్ని శరీర భాగాలను మేఘాలయాలోని చిరపుంజిలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.