27 నుంచి షిర్డీ-తిరుపతి ఎయిర్ లైన్స్ సర్వీసెస్
మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వెల్లడి

Shirdi: షిర్డీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి ఎయిర్లైన్స్ సేవలను ప్రారంభించనున్నట్టు మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. మార్చి 27 నుంచి విమాన సేవలు ప్రారంభమవుతాయని సంస్థ డిప్యూటీ చైర్మన్, ఎండి దీపక్ కపూర్ తెలిపారు.
ఇదిలావుండగా , ఈ విమాన సర్వీసు మార్చి 29 నుంచి ప్రారంభం కానుందని ప్రకటించినప్పటికీ , ముందుగానే ఈనెల 27 నుంచి నుంచి ప్రారంబిస్తున్నట్టు తెలిపారు. ఈ సేవలను స్సైస్ జెట్ ప్రారంభిస్తోందని అన్నారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు షిర్డీ విమానాశ్రయానికి చేరుకుంతుందని వెల్లడించారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/