శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు..

కిట్టీ పార్టీల పేరుతో సినీ ప్రముఖులను , బిజినెస్ రంగాలవారు దగ్గరి నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌‌ను మంజూరు చేస్తున్నట్లు ఉప్పర్‌పల్లి కోర్టు తెలిపింది. కోర్ట్ బెయిల్ మంజూరు చేయడం తో శిల్పా సంతోషంలో పడ్డారు. రేపు ఈమె జైలు నుండి బయటకు రానుంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు..ప్రతి శనివారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది. శిల్పాచౌదరి దాదాపు 25 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో ఉంది.

అధిక వడ్డీలు ఇస్తానని.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులని శిల్పాచౌదరి దంపతులు ప్రముఖుల నుంచి రూ.కోట్లలో వసూలు చేశారు. ఈ క్రమంలోనే వీరు చేస్తున్న మోసంపై ఓ మహిళ కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. అనంతరం ఈ వ్యవహారంలో శిల్పపై బాధితులు వరుస కేసులు పెట్టారు. దీంతో శిల్ప దంపతులను కోర్టు అనుమతితో మూడు సార్లు కస్టడీలోకి తీసుకొని నార్సింగి పోలీసులు విచారించారు. అయినా డబ్బు ఎక్కడికి తరలించారనే విషయం తెలుసుకోలేకపోయారు. అనంతరం ఆమె బ్యాంకు లాకర్లు కూడా తెరిచిన పోలీసులకు నిరాశే ఎదురైంది. వాటిల్లో కూడా ఏ ఆధారాలు దొరకలేదు. ఈ క్రమంలోనే కోర్టు నిరాకరిస్తున్న శిల్ప వరుసగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చింది. తాజాగా అన్ని కేసుల్లోనూ శిల్పకు కోర్టుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమె భర్తకు ఇదివరకే కోర్టు బెయిల్ జారీ చేయడం తెలిసిందే.