దాన్నిచెడగొట్ట కూడదని అపుడే నిర్ణయించుకున్నా..

శర్వానంద్‌, సమంత జంటగా దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ తెరకెక్కించిన ఎమోషనల్‌ లవ్‌ఎంటర్‌టైనర్‌ జాను.. దిల్‌రాజు నిర్మాత.. ఈచిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకుంది.. ఈసందర్భంగా హీరో శర్వానంద్‌ శనివారం మీడియాతో మాట్లాడారు.. ఆ వివరాలు.

Sharwanand Interview
Sharwanand

96 లాంటి రీమేక్‌ చేయటానికి ధైర్యం కావాలి.. మీరు ఎలా ఒప్పుకున్నారు?

నాకు నిర్మాత గారిపై నమ్మకం. ఆయనజడ్జిమెట్‌ ఎప్పుడూ తప్పుకాదని మొదట్లో నేను చేయనని చెప్పాను.. అయితే నో ప్రాబ్లమ్‌కచ్చితంగా వర్కవుట్‌ అవుతుందని ఆయనచెప్పి ఒప్పించారు.

ఇలాంటి ఛాలెంజింగ్‌ రోల్‌ చేయాల్సి వచ్చినపుడు మీకు ఎలా అన్పించింది?

చాలా భయం వేసేది. కొంచెం అటూ ఇటూ అయితే ట్రోల్స్‌ చేస్తారు.. ఓ పక్క గ్రేట్‌ పెర్ఫార్మర్‌ సమంత ఉన్నారు. మరోపక్క కంపారిజన్స్‌ వస్తాయి.. అందుకే చాలా భయం వేసింది.

ఒరిజినల్‌ 96 మూవీ చూశారా?

చూశాను.. సినిమా చూసిన తర్వాత వెంటనే నాకు ఇది క్లాసిక్‌ అని అర్ధమైంది.. దాన్నిచెడగొట్ట కూడదని అపుడే నిర్ణయించుకున్నా.

ఇండస్ట్రీనుంచి వచ్చినఫీడ్‌ బ్యాక్‌ ఏంటి?

ఇది రీమేక్‌ లా లేదు.. ఓ ఫ్రెష్‌ మూవీలా ఉంది. త్రిష, విజ§్‌ు సేతుపతి గుర్తుకురాలేదు అన్నారు.. అదే మాకు వచ్చిన బెస్ట్‌ ఫీడ్‌బ్యాక్‌.. దాంతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా..

ఈసినిమాచేయటానికి కారణం?

సెకండాఫ్‌ మొత్తం రెండు పాత్రలపై నిలబెట్టటం చాలా ఛాలెంజ్‌. అది దర్శకుడు చక్కగా చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే కామెడీ నేకాదు.. రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చొబెట్టగలిగాం.. అంటే ఎంటర్‌టైన్‌చేసినట్టే.

జాను తో మరో హిట్‌ మీ ఖాతాలో వేసుకున్నారు. ఎలా అన్పించింది?;

హిట్స్‌ చాలా కొట్టొచ్చు.. ఎప్పటికీ గుర్తుపెట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి.. ప్రస్థానం, గమ్యం, ఇపుడు జాను.. నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమాలు

రీమేక్‌ చేయటంపై మీ అభిప్రాయం?

రీమేక్‌ చేయాలంటే ప్రెజర్‌ ఎక్కువ ఉంటుంది. అలాంటిది క్లాసిక్స్‌ అంటే ఇంకా ఎక్కువ ప్రెజర్‌ మరియు భయం వేస్తుంది.. ఎందుకంటే ఒరిజినల్‌లో చేసినయాక్టర్‌తోపోలికలు ఉంటాయి.

వేగంగా సినిమాలు చేస్తున్నారు?

అక్ష§్‌ుకుమార్‌ ఫార్ములా ఫాలో అవుతున్నా.. మూడు విడుదల అవ్వాలి.. మూడు సెట్స్‌పైన ఉండాలి. బైలింగ్వల్‌ మూవీస్‌ అంటే గతంలో జర్నీ చేశాను.

శ్రీకారం..లో మీపాత్ర?

డాక్టర్‌ కొడుకు డాక్టర్‌, ఇంజనీర్‌కొడుకు ఇంజనీర్‌ కావాలనుకున్నపుడు రైతుకొడుకు రైతు ఎందుకు కాకూడదు అనే పాయింట్‌ ఆధారంగా ఈచిత్రం ఉంటుంది. డాక్టర్‌ కొడుకు డాక్టర్‌, ఇంజనీర్‌కొడుకు ఇంజనీర్‌ కావాలనుకున్నపుడు రైతుకొడుకు రైతు ఎందుకు కాకూడదు అనే పాయింట్‌ ఆధారంగా ఈచిత్రం ఉంటుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/