అమర జవాన్లకు నివాళులర్పించిన మోడీ

దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

PM Modi pays homage to martyrs at National War Memorial

న్యూఢిల్లీః దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే కలిసి ముందుకు సాగాలని దేశ ప్రజలకు సందేశమిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘ భారతీయులు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనది. దేశం కోసం అసువులుబాసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ అమరవీరులకు నివాళులర్పించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం యుద్ధ స్మారకం వద్ద ఉన్న డిజిటల్ విజిటర్స్ బుక్ లో తన సందేశాన్ని రాశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/