మేధస్సుకు పదును..

మనో వికాసం

Sharpened to intelligence .

కొత్త ఔషధాలను కనుకొంటున్నాం.. కఠిన సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం. త్వరలోనే డ్రైవర్‌లెస్‌ కారును ఆహ్వానించబోతున్నాం. ఇప్పటికే లైట్‌ ఆర్పాలన్నా, ఆన్‌ చేయాలన్నా ఫిజికల్‌ యాక్టివిటీ లేకుండానే చేసేస్తున్నాం.

ఇంట్లోని వస్తువులను వాయిస్‌ కమాండ్స్‌తో నియంత్రించే స్థాయికి వచ్చేశాం. ఇది మన లైఫ్‌ను కంఫర్ట్‌జోన్‌లోకి పంపిస్తోంది. బాగా సుఖంగా ఉంటోంది. కూడా.

మరోవైపు చూస్తే పది అంకెల ఫోన్‌ నెంబర్‌ను కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. పేర్లు కూడా.. మన దగ్గరి వాళ్లలో అయిదుగురి ఫోన్‌ నెంబర్లు టక్కున చెప్పేయగలమా అంటే నో అనాల్సిందే.

మేధస్సుకు సరైన అర్ధం జ్ఞానం. నైపుణ్యాల కలయిక. ఈ రెండూ కలిస్తేనే మేధాశక్తి. అదే మానవాళిని అతి శక్తివంతమైన జీవిగా తీర్చిదిద్దింది.

మనకు సహజ స్ధింగా ఏర్పడిన మేధస్సు పూర్వీకుల నుంచి సంక్రమించిందే.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నడుస్తున్నందున అంతా ఇంటికే పరిమితం కావాల్సి పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మేధస్సుకు సరైన అర్ధం జ్ఞానం, నైపుణ్యాల కలయిక. ఈ రెండూ కలిస్తేనే మేధా శక్తి. అదే మానవాళిని అతి శక్తిమంతమైన జీవిగా తీర్చిదిద్దింది.

మనకు సహజసిద్ధంగా ఏర్పడిన మేధస్సు పూర్వీకుల నుంచి సంక్రమించిందే.

ఒకానొకప్పుడు వేటగాడిగా ఉన్న మనుషులు అద్భుతాలు చేస్తూ చంద్రుడిపై కాలు పెట్టే స్థాయికి ఎదిగారు.

అంగారకుడిపై ఇల్లు కట్టుకొనేలా ఆవిష్కరణలు చేశారు.

ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌గురించి తెలుసుకుంటున్నారు. భవిష్యత్తు అంతా మెషీన్స్‌, న్యూరల్‌ అండ్‌ డీప్‌ లర్నింగ్‌దే.

మన కంప్యూటింగ్‌ పవరతో జీవన విధానం పూర్తిగా మారిపోతోంది. మన జన్యువులను డీకోడ్‌ చేయగలుగుతున్నాం.

కొత్త ఔషధాలను కనుక్కుంటాం. కఠిన సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం. త్వరలోనే డ్రైవర్‌లెస్‌ కారును ఆహ్వానించబోతున్నాం.

ఇప్పటికే లైట్‌ ఆర్పాలన్నా, ఆన్‌ చేయాలన్నా ఫిజికల్‌ యాక్టివిటీ లేకుండానే చేసేస్తున్నాం. ఇంట్లోని వస్తువులను వాయిస్‌ కమాండ్స్‌తో నియంత్రించే స్థాయికి వచ్చేశాం.

ఇది మన లైఫ్‌ను కంఫర్ట్‌జోన్‌లోకి పంపిస్తోంది. బాగా సుఖంగా ఉంటోంది.

కూడా. మరోవైపు చూస్తే పది అంకెల ఫోన్‌ నెంబర్‌ను కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాం.

పేర్లు కూడా.. మన దగ్గరి వాళ్లలో అయిదుగురి ఫోన్‌ నెంబర్లు టక్కున చెప్పేయగలమా అంటే నో అనాల్సిందే.

కాని ఒకప్పుడు వందల నంబర్లు గుర్తు పెట్టుకునేవాళ్లం.

ఎవరైనా అడ్రస్‌ అడిగితే పక్కన షాప్‌ పేరు, బిల్డింగ్‌ కలర్‌తో సహా చెప్పేవాళం. మరి ఇప్పుడు మ్యాప్స్‌ ఆన్‌ చేసుకుని లొకేషన్‌ను చేరిపోతున్నాం.

దాంతో ఎటు వెళుతున్నామో తెలీకుండానే గమ్యం చేరుస్తున్నాం. మన జీవితాలను కూడా షెడ్యూల్‌ చేసుకోవాల్సిన పరిస్థితి.

అదంతా టెక్నాలజీ వల్లే. అంటే మన మేధాశక్తిని కోల్పోతున్నామన్న మాట.

ఒక్క మాటలో చెప్పాలంటే వెబ్‌ అనే ట్రాప్‌లో పడుతున్నాం.

ప్రస్తుత యువత అయితే మరీ ఎక్కువ. జీవితాలను మరింత సుఖవంతంగా, సౌకర్యవంతంగా మార్చుకోవడంలో తప్పు లేదు. కానీ టెక్నాలజీకి బానిస కాకుండా ఉండాలి.

ఏ సమయంలో టెక్నాలజీని ఆహ్వానించాలి, ఏ టైంలో తిరస్కరించాలి అని నిర్ణయించుకోవడానికి ఇదే సరైన సమయం .

లేకపోతే మన జీవితాలపై మనమే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.

టెక్నాలజీకి బానిస అయితే రాబోయే రోజుల్లో ఆలోచనా శక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఒక సర్వేలో తేలింది. పలు కంపెనీలు మనం ఎక్కడుంటున్నామో తెలుసుకుంటున్నాయి.

ఏం కోరుకుంటున్నామో చెబుతున్నాయి. మనం పనిచేసే చోటు, సమయం, తినే అలవాట్లు.. ఇలా అన్నీ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోతున్నాయి. ఇంఉదకు కారణం టెక్నాలజీనే.

రాను రాను మనిషి రోబోలా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదనే చెప్పాలి.

మరి మన సహజసిద్ధమైన మేధాశక్తిని ఎలా పెంచుకోవాలి అంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఎక్కడుంచాలి? అంటే..

లాక్‌డౌన్‌ సమయాన్ని వాడుకుని ఘనమైన మేధస్సును సొంతం చేసుకోవచ్చు.

అంటే మన కామన్‌సెన్స్‌ను మనం తెచ్చుకున్నట్లే లెక్క. అందుకే మన చుట్టూ ఉన్నవ్యక్తులపై, వస్తువులపై, ప్రాంతాలపై దృష్టి పెట్టాలి.

కాంటాక్ట్‌ బుక్‌లో వెతక్కుండా తెలిసిన 20 మంది ఫోన్‌ నెంబర్లను గుర్తుంచుకునేలా చేసుకోవాలి. మనం ఉండే ప్రాంతం మూలలన్నీ తెలుసుకోవాలి.

లాక్‌డౌన్‌లో సాధ్యంకాకపోయినా ఆ తర్వాతైనా తిరిగి తెలుసుకోవాలి. కొన్ని ప్రముఖ స్థలాలను గుర్తుపెట్టుకోవాలి.

ఇష్టమైన వాళ్ల పుట్టినరోజులు, పెళ్లిరోజులు గుర్తుంచుకోవాలి. ఒకేసారి ఇదంతా సాధ్యం కాకపోవచ్చు.

మెల్లిమెల్లిగా అయినా సరే మనకు మన పూర్వీకులు అందించిన సహజసిద్ధమైన మేధాశక్తిని తిరిగి దక్కించుకోవాలి. మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్‌ చేయాలి.

మెదడుకు మేత పెడితేనే అది సాధ్యం అవుతుంది. అందుకే గెట్‌ రెడీ నౌ..!

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/