పిల్లలకు నెమ్మదిగా చెప్పాలి

పిల్లలకు నెమ్మదిగా చెప్పాలి
Children Care-

పిల్లలు రోజు స్కూలు నుంచి రాగానే క్లాస్‌లో ఎవరూ తనతో సరిగ్గా మాట్లాడటం లేదని, టీచర్‌ పుస్తకాలు లాగేసుకుందని అమ్మకు చెపుతుంటారు. మొదట్లో తేలిగ్గానే తీసుకున్నా. చివరకు స్కూలుకు వెళితే తమ పాపే పిల్లల్ని కొడుతుందని, టీచర్లు చెప్పేసరికి ఆ తల్లికి చాలా కోపం వచ్చింది. కొందరు పిల్లలు స్కూల్‌ నుంచి బ్యాగ్‌లో నుండి రకరకాల పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కేళ్లు బయటికి తీస్తుంటాడు. అన్ని ఎక్కడివి? ఎవరైనా ఇస్తున్నారా తోటి వారివి తెస్తున్నాడా తల్లి అనుకుంటుంది.

అయితే ఆ విషయాన్ని ఆమె అంతగా పట్టించుకోదు. కాని ఒకసారి టీచర్‌ డైరీలో ‘ మీ అబ్బాయి ఇతరుల వస్తువులు తీస్తున్నాడు అని కంప్లైంట్‌ రాసి పంపి స్తుంది. అప్పటికి ఆ తల్లికి ఏం జరుగుతుందో తెలియలేదు. ఇలాంటివి తేలిగ్గా తీసుకోకూడదు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించకపోతే పెద్దయ్యే కొద్దీ ఇంకా పెరుగుతాయి. అందుకే సమస్య తెలిసిన వెంటనే పరిష్కరంచడం మంచిది. తోటి పిల్లలతో గొడవ పడటం, వారిని కొట్టడం వంటివి చిన్న విషయాలయినా కొన్నిసార్లు వాటిని పెద్దలు నియంత్రించలేకపోతారు.

అలాంటి పిల్లలు పెరిగాక కూడా తల్లిదండ్రులతో వాదిస్తుంటారు. తాను చేసేది తప్పు కాదంటారు. లేదా ఇతరులపై ఆ తప్పును వేస్తారు. ఈ క్రమంలో పెద్దలతో గొడవపెట్టుకోవడం కూడా జరుగుతుంది. కారణం లేకుండా కక్షసాధిస్తున్నట్లు ప్రవర్తించడం, ఇంట్లో వారిపై ద్వేషం పెంచుకోవడం చేస్తుంటారు. నచ్చిన వస్తువులు సొంతం చేసుకోవానుకుంటారు.

ఇలాంటివి పిల్లల్లో ఉన్నట్లనిపిస్తే వీలైనంత త్వరగా అదుపు చేయాలి. ప్రవర్తనాపరమైన చికిత్సలతో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. అలాగే ఇంటి పరిస్థితులు వారిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో గమనించాలి. ఎలాంటి వాతావరణం కల్పించాలనే అవగాహన తల్లిదండ్రులకు ఉండటం కూడా చాలా అవసరమని మానసిక నిపుణులు అంటున్నారు.
ఎనభైశాతం మందికి ఇల్లు, కుటుంబసభ్యులే ప్రపంచం. తరువాతే స్నేహితులూ, పాఠశాల ప్రభావం ఉంటుంది. చిన్నారులకు పెద్దలు అద్దంలాంటి వాళ్లు.

చిన్నారులు వారిని చూసి నేర్చుకుంటారు. అంటే మంచైనా, చెడైనా పెద్దలు ఏది చేస్తే పిల్లలు అదే ఆచరించాలని అనుకుంటారు. పెద్దలు సరదాకో, అవసరానికో అబద్ధాలాడటం చేస్తే అది తప్పుకాదని పిల్లలనుకునే అవకాశముంది. కొంతమంది పిల్లల్లో గుణంలో సానుభూతి, దయ ఉండకపోవడంతో హింసాత్మకమైన కోణం పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారిపై ఫిర్యాదులు చేసుకోవడం, పక్కింటివారి గుర్తించి ఆరోపణలు,బంధువుల్ని, స్నేహితుల్ని నిందించడం వంటివి పిల్లల్లో కండక్ట్‌ డిజార్డకు బీజం పడేలా చేస్తాయి.

దీంతో చిన్నారు మనసుల్లో ప్రతికూల భావం ఏర్పడుతుంది. దీనివల్ల కొందరు సమాజాన్ని ద్వేషించడం మొదలుపెడతారు. అలా కాకుండా తప్పు చేసినా నిదానంగా మందలించాలి. సున్నితంగా కోప్పడాలి. పిల్లలకు మంచి పనులు చేసినప్పుడు చిన్న చిన్న బహుమతులు ఇస్తుండాలి. ఇలా చేస్తే పిల్లలు మంచి మార్గంలో నడిచే అవకాశ ముంటుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/