కేర‌ళలో విస్తృతంగా వ‌ర్షాలు

భారత వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడి

rains in Kerala
rains in Kerala

కేర‌ళలో నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌క ముందే వాటి ప్ర‌భావంతో వ‌ర్షాలు కురుస్తున్నాయని, ద‌క్షిణ అరేబియా స‌ముద్రం మీదుగా ప‌డ‌మ‌టి గాలులు బ‌లంగా వీస్తున్నాయ‌ని భారత వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. కేర‌ళ తీరం మీదుగా ద‌ట్ట‌మైన మ‌బ్బులు క‌మ్ముకుని ఉంటున్నాయ‌ని తెలిపింది. రాగ‌ల 24 గంట‌ల్లో కేర‌ళలో వ‌ర్షాలు విస్తృతంగా పడే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావరణ కేంద్రం పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/