ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ ఫిక్స్..?

ఎన్టీఆర్ 30 వ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఒకటి , రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూ. ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. గత కొద్దీ రోజులుగా ఈ మూవీ కి సంబదించిన ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఆ పనులన్నీ పూర్తి అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఫిలిం వర్గాల సమాచారం.. సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13 నుంచి NTR 30 రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా..జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు.

అలాగే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత కె.జి.య‌ఫ్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు. దీనిని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తుంది.