బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి..బారుల తెలంగాణగా మార్చారంటూ కేసీఆర్ ఫై షర్మిల ఫైర్

బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి..బారుల తెలంగాణగా మార్చారంటూ కేసీఆర్ ఫై షర్మిల ఫైర్
ys-sharmila

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. బంగారు తెలంగాణ తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ….బీరుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు.

మంగళవారం నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎదుట నిర్వహించిన నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. వర్సిటీలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆరోపించారు.

ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్లకు అందరూ ఖాళీలు ఉన్నాయని.. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోందన్నారు. యూనివర్సిటీ సమస్యలపై ఎన్ని లెటర్ లు రాసినా పట్టించుకునే నాధుడే లేరని నిప్పులు చెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీ33 శాతం, తెలంగాణ లో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం పోస్టులు ఖాళీలేనని… విద్యార్థుల భవిష్యత్ పై సీఎం కేసీఆర్ కు ఆలోచన లేదా….మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా ? అని నిలదీశారు. బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా…? అని ప్రశ్నించారు.