దసరా పండగ వేళ..అమ్మవారికి మందు తాగించి వార్తల్లో నిల్చిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమిచేసినా సంచలనమే..ట్వీట్ చేసిన..సినిమా చేసిన ..ఇలా ఏది చేసిన సరే వార్తల్లో నిలువాల్సిందే. తాజాగా దసరా పండగ వేళ..అమ్మవారికి మందు తాగించి హాట్ టాపిక్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కొండా అనే సినిమాను చేస్తున్నా రు. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకత సాధించిన కొండా దంపతుల కథాంశం నేపథ్యంలో.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా ప్రారంభోత్స‌వం కోసం ఆర్జీవీ వరంగ‌ల్‌కు చేరుకున్నారు. అక్క‌డ వంచ‌న‌గిరి గ్రామంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. షూటింగ్ ప్రారంభించ‌డానికి ముందు అక్క‌డ ఉన్న గండి మైస‌మ్మ అమ్మ‌వారి ఆల‌యాన్నిద‌ర్శించుకున్నారు. అలాగే అక్క‌డ సంస్కృతిని ఫాలో అవుతూ గండి మైస‌మ్మ అమ్మ‌వారికి మందు తాగించి అమ్మ‌వారి ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఘన స్వాగతం పలికారు కొండా సురేఖ దంపతులు. మొదట కొండా సురేఖ ఇంటికి వెళ్ళిన వర్మ.. అనంతరం ర్యాలీ నిర్వహించారు. వరంగల్ నుండి వంచనిగిరి వరకు ర్యాలీ నిర్వహించారు.