మంత్రి మండలిలో ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం
జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

విజయవాడ: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ నగరంలోని మున్సిపల్ స్టేడియంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంత్రి మండలిలో ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని అన్నారు. వనరుల సమతుల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ పాలన కర్నూలు నుంచి, చట్ట సభలను అమరావతిలో ఉంచాలని నిర్ణయించింది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. వైఎస్సార్ నవశకం ద్వారా వాలంటీర్లతో నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు ప్రభుత్వం చేపడుతుందని గవర్నర్ తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/