ఎన్టీఆర్‌ పీఆర్‌ఓ మహేశ్‌ కోనేరు మృతి

ఎన్టీఆర్‌ పీఆర్‌ఓ మహేశ్‌ కోనేరు మృతి

ప్రముఖ ప్రొడ్యూసర్ , నందమూరి పీఆర్‌ఓ మహేశ్‌ కోనేరు మృతి చెందారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్‌ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్‌ పరిశ్రమ షాక్‌ గురయ్యింది. మరీ ముఖ్యంగా నందమూరి హీరోలు జూనీయర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ రామ్‌లు ఆయన మరణవార్తకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

మహేశ్‌ మృతిపై ఎన్టీఆర్‌ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. మహేశ్‌ మృతి జీర్ణించుకోలేకపోతున్నానని, మాటలు రావడం లేదు.. బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా అంటూ ఎన్టీఆర్‌ ఎమోషన్‌ ఆయ్యారు. అలాగే కళ్యాణ్ రామ్ సైతం తన బాధను వ్యక్తం చేసారు. అవును ఇది నమ్మలేకని వార్త. షాక్‌కు గురయ్యాను. మా స్నేహితులు, కుటుంబానికి అంత్యంత దగ్గరి వ్యక్తి, వెల్‌ విషర్‌ అయిన మహేశ్‌ కోనేరు ఇక లేరు. ప్రతి విషయంలో ఆయన మాకు వెన్ను దన్నుగా నిలిచారు. ఆయన మా కుటుంబానికి వెన్నుముకగా నిలిచారు. ఆయనను కొల్పోవడం వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకు పెద్ద నష్టం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులు, స్నేహితులు శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.