ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి ఫై షర్మిల ఫైర్

వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైస్ షర్మిల..టిఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి ఫై నిప్పులు చెరిగింది. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్దీ నెలలుగా షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసిన ఈమె..శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సందర్భాంగా మంత్రి నిరంజన్ రెడ్డి ఫై మాటాల తూటాలు పేల్చారు. తాను ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే.. ఈ నిరంజన్ రెడ్డి తనను గతంలో మంగళవారం మరదలు అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు.

నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడని షర్మిల అన్నారు. ఆయనకు, కుక్కకు తేడా ఏమైనా ఉందా..? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని మంత్రిపై షర్మిల ఫైర్ అయ్యారు. నిరంజన్ రెడ్డికి అధికార మదం తలకెక్కిందని ఆరోపించారు. తెలంగాణలో హమాలీ పనికి మించిన పని లేదా అని ప్రశ్నించారు. మంత్రి కూడా రాజీనామా చేసి హమాలీ పని చేసుకోవచ్చు కదా అని సూచించారు.

పేరుకు మాత్రమే నీళ్ల నిరంజ‌న్ రెడ్డి. ప్రజ‌ల‌కు మిగిల్చింది మాత్రం క‌న్నీళ్లే. మంత్రి హోదాలో ఉండి, క‌నీసం పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేని ద‌ద్దమ్మ. ఒక‌ప్పుడు ఏమీ లేని ఈ మంత్రి కేసీఆర్‌లాగే వేల కోట్లు సంపాదించాడ‌ట‌. 150 ఎకరాల్లో ఫాంహౌజ్ క‌ట్టుకున్నాడ‌ట‌. ఏ భూములు వదలడట. గుడిని గుళ్లోని లింగాన్ని మింగే రకమట. మందు తాగేవాడు ముఖ్యమంత్రి అయితే.. పెగ్గుపోసేవాడు మంత్రయినా కావాలి కదా.. మీ ఊరి వాళ్లే చెప్పారు నాకు’’ అంటూ షర్మిల ఆరోపించారు.