కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఫై బండి సంజయ్..విజయశాంతి ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భాంగా జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన ప్రణాళికలు పూర్తి చేసారు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఫై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ హైదరాబాద్లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన క్రమంలో, గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆయన చేతిలోని మైక్ లాక్కొని ఘర్షణ కు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బిస్వ శర్మను మాట్లాడనీయకుండా మైకు లాక్కోవడం హేయమైన చర్య అని బండి సంజయ్ అన్నారు. పక్క రాష్ట్ర సీఎంను గౌరవించలేని కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తారా అని మండిపడ్డారు. అత్యంత అద్భుతంగా హైదరాబాద్లో జరిగే శోభాయాత్రను తిలకించడానికి వచ్చిన అతిధిని గౌరవించాలనే కనీసం సోయి కూడా లేకుండా టిఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మెడలో టిఆర్ఎస్ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నాయకులను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు స్టేజిపైకి ఎలా రానిచ్చారు అని ప్రశ్నించిన బండి సంజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే భద్రత ఇదేనా అంటూ ప్రశ్నించారు.

ఈ ఘటనఫై బిజెపి నేత విజయశాంతి సైతం స్పందించారు. ‘‘గణేశ్ నిమజ్జనం కోసం హైదరాబాద్ వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సభలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలు చూస్తే తెలంగాణలో ఎంత అరాచక వ్యవస్థ నడుస్తోందో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. తెలంగాణకు వచ్చిన మరో రాష్ట్ర సీఎంని ప్రభుత్వ అతిథిగా, వీవీఐపీగా గౌరవించాల్సింది పోయి కనీస భద్రత కూడా కల్పించలేని దుస్థితిలో కేసీఆర్ సర్కారు ఉంది. హిమంతగారు పాల్గొన్న సభలో వేదిక మీదికి ఒక టీఆరెస్ కార్యకర్త వచ్చి మైక్ విరగ్గొట్టడం, అతన్ని ఆపడానికి అక్కడి పోలీసులు ముందుకు రాకపోవడం చూస్తుంటే ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిన సంఘటనేనని అని అర్ధమవుతున్నారు.